ఓటీటీలో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్!

  • తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ గా 'స్టీఫెన్'
  • డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ 
  • ఐదు భాషల్లో అందుబాటులోకి 
  • అమ్మాయిల హత్యల చుట్టూ తిరిగే కథ
    
ఒక సైకో వరుస బెట్టి హత్యలు చేస్తూ వెళుతుంటాడు. కేవలం అతను అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తూ వెళుతుంటాడు. హంతకుడిని పట్టుకోవడానికి ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. చకచకా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఇన్వెస్టిగేషన్ లో అడుగడుగునా అతనికి సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఆయన ఎలా అధిగమిస్తూ ముందుకు వెళతాడు? అనే కథాంశంతో గతంలో చాలానే సినిమాలు .. సిరీస్ లు వచ్చాయి. 

ఇప్పుడు ఓటీటీకి రానున్న సైకాలాజికల్ థ్రిల్లర్ 'స్టీఫెన్' కూడా ఇదే రూట్లో ముందుకు వెళుతుంది. 9 మంది అమ్మాయిల హత్యల చుట్టూ ఈ కథ నడుస్తుంది. అయితే రొటీన్ కి భిన్నమైన ఒక పాయింట్ ను ఈ సినిమాలో టచ్ చేయనున్నట్టు దర్శకుడు మిథున్ బాలాజీ చెబుతున్నారు. హత్యలు చేయడానికి హంతకుడు పన్నే వ్యూహాలు .. తప్పించుకునే మార్గాలు .. ఇన్వెస్టిగేషన్ కొనసాగే తీరు .. ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తుందని అంటున్నారు. 

గోమతి శంకర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, స్మృతి వెంకట్ కీలకమైన పాత్రలో నటించారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి ఈ సినిమాను 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థ్రిల్లర్ జోనర్ పట్ల ఆసక్తిని కనబరిచేవారిని ఈ సినిమా ఎంతవరకూ ఆకట్టుకుంటుందనేది చూడాలి. 



More Telugu News