షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత... బంగ్లాదేశ్ కీలక నిర్ణయం

  • షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన ట్రైబ్యునల్
  • రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేలా సన్నాహాలు చేపట్టిన బంగ్లాదేశ్
  • బంగ్లాదేశ్ మీడియాలో వార్తలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాలని భావిస్తోంది. మానవత్వం మరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమెను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ భారత్ విముఖత చూపిస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గత సంవత్సరం దేశం విడిచిన షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను అభ్యర్థించడానికి బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ గాజీ తమీమ్ సన్నాహాలు చేస్తున్నారని బంగ్లాదేశ్ దినపత్రిక 'ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్' నివేదించింది.

పరారీలో ఉన్న ఇద్దరు నిందితులపై రెడ్ నోటీసులు జారీ చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇదివరకే ఇంటర్‌పోల్‌కు అరెస్టు వారెంటుతో పాటు దరఖాస్తు సమర్పించినట్లు బంగ్లాదేశ్ మీడియాలో వార్తలు వచ్చాయి. గత సంవత్సరం జరిగిన రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఢిల్లీలో గుర్తు తెలియని ప్రాంతంలో ఉంటున్నట్లు తెలుస్తోంది.


More Telugu News