మారుమూల గ్రామంలో పుట్టిన ఒక దైవిక లక్ష్యమే సత్యసాయి: నారా లోకేశ్
- శ్రీ సత్యసాయి జయంతి వేడుకల్లో మంత్రి నారా లోకేశ్
- బాబా జీవితం లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తోందని వ్యాఖ్య
- శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సేవలను కొనియాడిన మంత్రి
ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఒక దైవిక లక్ష్యం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత, సేవకు ప్రతిరూపంగా విరాజిల్లుతోందని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ..
బాబా జీవితం ఖండాలు, సంస్కృతులు, విశ్వాసాలు, వయసుతో సంబంధంలేకుండా లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తోందని అన్నారు. బాబా బోధనలు ప్రపంచ ప్రేమ, సమత, స్వార్థరహిత సేవను నిర్వచిస్తూ ప్రతి మనిషికి సందేశం అందిస్తున్నాయని చెప్పారు. భగవాన్ చూపిన పవిత్ర మార్గాన్ని అనుసరిస్తూ, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు సమాజానికి విశేషమైన సేవలను అందిస్తున్నాయని మంత్రి లోకేశ్ కొనియాడారు.
బాబా చూపిన కరుణను మార్గదర్శకంగా తీసుకొని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ ద్వారా కీలకమైన శస్త్రచికిత్సలు చేస్తూ లక్షలాది మందికి పునర్జన్మ అందిస్తున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు.