లొంగిపోవాలనుకున్న హిడ్మా.. ఎన్‌కౌంటర్‌కు 10 రోజుల ముందే జర్నలిస్టుకు లేఖ!

  • మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిలో కీలక పరిణామం
  • మరణానికి పది రోజుల ముందు జర్నలిస్టుకు లేఖ రాసిన వైనం
  • భద్రత హామీ ఇస్తే లొంగిపోవడానికి సిద్ధమంటూ వెల్లడి
  • ఆయుధాలు వీడేలోపే ఎన్‌కౌంటర్‌లో మరణించిన హిడ్మా
మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, గెరిల్లా దాడుల వ్యూహకర్త మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరణించడానికి కేవలం పది రోజుల ముందు ఆయన ఆయుధాలు వీడి, లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ జర్నలిస్టుకు లేఖ రాసినట్లు సమాచారం.

ఈ లేఖలో హిడ్మా తన భవిష్యత్ ప్రణాళికను వివరించినట్లు తెలుస్తోంది. తమ భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎక్కడ లొంగిపోవాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. లొంగిపోయే ముందు కొన్ని కీలక అంశాలపై చర్చించాల్సి ఉందని కూడా తెలిపారు.

ఈ విషయంపై త్వరలోనే హిందీ, తెలుగు భాషల్లో ఆడియో సందేశం విడుదల చేస్తామని కూడా హిడ్మా ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో తనను కలవాలని సదరు జర్నలిస్టుకు సూచించినట్లు సమాచారం.

అయితే, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే, నిన్న మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మరణించడం గమనార్హం.


More Telugu News