ఓ చేత్తో తిరగలి తిప్పుతూ రాజమౌళికి హితవు పలికిన మాధవీలత
- దేవుడిపై నమ్మకం లేదన్న రాజమౌళి వ్యాఖ్యలపై మాధవీలత స్పందన
- మీ మాటలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతాయని హితవు
- విశ్వాసం బలహీనత కాదని, వినయం పాతకాలపు పద్ధతి కాదని వ్యాఖ్య
- విజయం వివేకాన్ని పెంచాలి కానీ విలువలను తగ్గించకూడదని సూచన
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ఉద్దేశించి బీజేపీ నాయకురాలు మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. "నాకు దేవుడిపై నమ్మకం లేదు" అని రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె స్పందించారు. రాజమౌళి లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ పెట్టారు. అందులో మాధవీలత తిరగలి తిప్పుతూ మాట్లాడడం చూడొచ్చు.
"ప్రియమైన సోదరుడు రాజమౌళి గారూ, మీరు కోట్లాది మందికి స్ఫూర్తి. మీలాంటి వారు 'నాకు దేవుడిపై నమ్మకం లేదు' అని చెబితే, అది కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా మిగిలిపోదు. అది ఎందరో యువత మనసులపై ప్రభావం చూపే సందేశంగా మారుతుంది" అని మాధవీలత పేర్కొన్నారు.
"విశ్వాసం అనేది బలహీనత కాదు. వినయంగా ఉండటం పాతకాలపు పద్ధతి కాదు. అలాగే, మన మూలాలను అగౌరవపరచడం ఎప్పటికీ సృజనాత్మకత అనిపించుకోదు. విజయం మనలో వివేకాన్ని పెంచాలి కానీ, విలువలను తగ్గించకూడదనే విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. దయచేసి బాధ్యతగా మాట్లాడండి, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు" అని ఆమె తన పోస్టులో వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.