తెలంగాణలో ఏసీబీ అధికారులను చూసి పొలాల్లోకి పరుగెత్తిన ఎస్సై

  • మెదక్ జిల్లా టేక్మల్‌లో ఘటన
  • ఒక కేసులో రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఘటన
  • వెంబడించి పట్టుకుని విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు
తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలోని టేక్మల్‌లో ఒక ఎస్సై లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కడంతో పొలాల్లోకి పారిపోయాడు. ఒక కేసు విషయంలో ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఏసీబీ అధికారులను చూడగానే ఆందోళనకు గురైన ఎస్సై పక్కనే ఉన్న పొలాల్లోకి పరుగు తీశాడు.

ఏసీబీ అధికారులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం, అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. ఎస్సై రాజేశ్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట టపాసులు కాల్చి సంబరాలు జరుపుతున్నారు.


More Telugu News