Rajasthan Tribes: ఏటా కొత్త భాగస్వామి.. రాజస్థాన్‌లోని ఈ తెగలో వింత ఆచారం

Rajasthan Tribes Strange Garasia Tribe Custom of Choosing New Partner Every Year
  • రాజస్థాన్‌ గరాసియా తెగలో వింత సంప్రదాయం
  • జాతరలో మహిళలు కొత్త భాగస్వామిని ఎంచుకునే అవకాశం
  • కొంతకాలం సహజీవనం తర్వాతే వివాహ బంధం
  • భాగస్వామిని మార్చుకోవాలంటే భారీగా పరిహారం చెల్లించాలి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గిరిజన ఆచారం
భారతీయ చట్టాల ప్రకారం ఏకపత్నీవ్రతం, ఏకభర్తృత్వం అమలులో ఉన్నాయి. అయితే, దేశంలోని ఓ గిరిజన తెగలో మాత్రం ఇందుకు భిన్నమైన ఆచారం కొనసాగుతోంది. ఇక్కడి మహిళలు ప్రతి ఏటా తమకు నచ్చిన కొత్త భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారు. ప్రస్తుతం ఈ విచిత్ర సంప్రదాయానికి సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని గరాసియా అనే గిరిజన తెగలో ఈ ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ తెగ వారు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరలోనే మహిళలు తమకు నచ్చిన పురుషుడిని తమ భాగస్వామిగా ఎంపిక చేసుకుంటారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి సహజీవనం ప్రారంభిస్తారు. ఇలా సహజీవనం మొదలుపెట్టేందుకు పురుషుడు, మహిళకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

వారి సహజీవన కాలంలో మహిళ గర్భం దాలిస్తే, అప్పుడు వారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. ఒకవేళ తమ ప్రస్తుత భాగస్వామితో జీవించడం ఇష్టం లేకపోతే, మహిళ మరో వ్యక్తిని ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అయితే, అలా కొత్తగా వచ్చే వ్యక్తి, ఆమె పాత భాగస్వామికి అంతకంటే ఎక్కువ మొత్తంలో డబ్బును పరిహారంగా చెల్లించాలనే నిబంధన ఉంది. ఈ ఆచారం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
Rajasthan Tribes
Garasia Tribe
Rajasthan
Tribal Customs India
Live-in Relationships
Customs
Traditions
Social Customs
Indian Culture

More Telugu News