Chandrababu Naidu: నేడు పుట్టపర్తికి వెళుతున్న చంద్రబాబు, పవన్.. రేపు రానున్న మోదీ

Chandrababu Pawan to Visit Puttaparthi Today Modi Tomorrow
  • పుట్టపర్తిలో ఘనంగా శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాలు
  • పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖుల రాక
  • ప్రధాని పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి పట్టణం మొత్తం కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.

వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్ , అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, సత్యకుమార్ తదితరులు కూడా నేటి వేడుకలకు హాజరుకానున్నట్లు సమాచారం. ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు విస్తృతమైన భద్రతా చర్యలు చేపట్టారు.

ఇక ఈ ఉత్సవాలకే హైలైట్‌గా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తికి రానున్నారు. ప్రధాని పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది. ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ, గోవిందరావు, కల్యాణ్ చక్రవర్తిలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరికి సహాయకంగా ఇతర జిల్లాలకు చెందిన ఒక జేసీ, 9 మంది డిప్యూటీ కలెక్టర్లను కూడా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. 
Chandrababu Naidu
Puttaparthi
Pawan Kalyan
Narendra Modi
Sri Satya Sai Baba
Prasanthi Nilayam
AP Government
Andhra Pradesh
Political News
Kishan Reddy

More Telugu News