పిస్తా హౌస్, షా గౌస్‌పై ఐటీ పంజా.. 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు

  • హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లపై ఐటీ దాడులు
  • ఏకకాలంలో 15 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు
  • హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లోనూ తనిఖీలు
హైదరాబాద్ నగరంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. నగరానికి చెందిన ప్రముఖ హోటల్స్ అయిన పిస్తా హౌస్, షా గౌస్‌ లక్ష్యంగా ఈ ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. రెండు సంస్థలకు సంబంధించి ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.

వివిధ బృందాలుగా విడిపోయిన అధికారులు.. పిస్తా హౌస్, షా గౌస్‌ కార్యాలయాలతో పాటు వాటి ఛైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల సందర్భంగా అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని, వాటిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. పన్ను చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

నగరంలో మంచి పేరున్న ఈ రెండు హోటళ్లపై ఐటీ దాడులు జరగడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తనిఖీలు పూర్తయిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


More Telugu News