ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన.. ఏర్పాట్ల కోసం ప్రత్యేక అధికారుల నియామకం
- ఏర్పాట్ల పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్ అధికారుల నియామకం
- సమీప జిల్లాల జేసీ, డిప్యూటీ కలెక్టర్లకు అదనపు బాధ్యతలు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ
- ఏర్పాట్లపై సమీక్ష జరిపిన మంత్రుల కమిటీ
సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న పుట్టపర్తిలో పర్యటించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రధాని పర్యటన సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు, రవాణా సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ, గోవిందరావు, కల్యాణ్ చక్రవర్తికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ప్రధాని పర్యటన ముగిసే వరకు వీరు పుట్టపర్తిలోనే ఉండి ఏర్పాట్లను సమన్వయం చేస్తారు. వీరితో పాటు సమీప జిల్లాలకు చెందిన ఒక జాయింట్ కలెక్టర్ (జేసీ) మరియు 9 మంది డిప్యూటీ కలెక్టర్లకు కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. మరోవైపు ఏర్పాట్లపై మంత్రుల బృందం నిన్న సమీక్ష నిర్వహించింది. కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యసాయి శత జయంతి వేడుకల నిర్వహణ నోడల్ అధికారులు ఎంటీ కృష్ణబాబు, వీరపాండియన్ లతో సమీక్షించారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పలువురు ప్రముఖులు బాబా శత జయంతోత్సవాల్లో పాల్గొననున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించారు.