'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ పై సుమ కనకాల ట్వీట్

  • హైదరాబాదులో వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్
  • హోస్ట్ గా వ్యవహరించిన సుమ
  • సోషల్ మీడియాలో స్పందన 
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న 'వారణాసి' చిత్రం కోసం హైదరాబాద్‌లో నిర్వహించిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌పై స్టార్ యాంకర్ సుమ కనకాల ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన ఆమె, ఆ రాత్రిని తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన అనుభవంగా అభివర్ణించారు.

"సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రాత్రి ఇది. 130 అడుగుల భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై రాజమౌళి గారు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషికి జీవం పోసిన తీరు అద్భుతం" అని సుమ తన పోస్టులో పేర్కొన్నారు. ఆ ఈవెంట్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని, అందులో రాజమౌళి సినిమాలోని అన్ని భావోద్వేగాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ ఈవెంట్‌లో తన హోస్టింగ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన సందేశాలు, ట్వీట్లు, రీల్స్‌కు సుమ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. "నాపై ఇంత ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రేక్షకులను అలరించడమే నా ప్యాషన్. ఆ ప్యాషన్ ఇలాగే కొనసాగుతుంది" అని ఆమె తన పోస్టులో ఉద్వేగంగా రాసుకొచ్చారు. 


More Telugu News