ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసిన విన్ గ్రూప్ ఆసియా సీఈవో
- ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి
- తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుకు విన్ గ్రూప్ ఆసక్తి
- ఈవీలు, బ్యాటరీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు విన్ గ్రూప్ సంస్థ వెల్లడి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విన్ గ్రూప్ ఆసియా సీఈవో సమావేశమయ్యారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండగా, దేశ రాజధానిలో ముఖ్యమంత్రితో సీఈవో భేటీ అయ్యారు. తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి విన్ గ్రూప్ ఆసక్తి కనబరిచింది.
ఈవీలు, బ్యాటరీ స్టోరేజీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు విన్ గ్రూప్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. డిసెంబరు 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని ఆహ్వానించారు.
ఇదిలా ఉండగా, అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.