విశాఖ సదస్సులో మన చిన్న కమ్మ కల్యాణ్ గారు కనిపించడంలేదంటబ్బా!: అంబటి రాంబాబు

  • పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు సెటైర్
  • విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్‌కు పవన్ ఎందుకు రాలేదని ప్రశ్న
  • చంద్రబాబు, లోకేశ్‌లను కూడా తన పోస్టుకు ట్యాగ్ చేసిన అంబటి
  • సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన అంబటి వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) భాగస్వామ్య సదస్సును ప్రస్తావిస్తూ ఆయనపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.

తన అధికారిక ఎక్స్ ఖాతాలో అంబటి రాంబాబు నేడు ఓ పోస్ట్ పెట్టారు. "విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిగిన CII సమ్మిట్‌లో మన చిన్న కమ్మ కల్యాణ్ గారు కనిపించలేదేంటబ్బా! అని ఆయన ప్రశ్నించారు. ఈ ట్వీట్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పవన్ కల్యాణ్‌ను కూడా ఆయన ట్యాగ్ చేశారు.

ప్రస్తుతం అంబటి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


More Telugu News