జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం .. తీరా వెళ్లి చూస్తే ...!

  • హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి కారు ప్రమాదం
  • మద్యం మత్తులో యువతి డ్రైవింగ్ చేసినట్లు గుర్తింపు
  • నియంత్రణ కోల్పోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
  • ప్రమాదంతో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫిలిమ్ నగర్ పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా ఒక్క సారిగా అవాక్కయ్యారు. 

ఓ యువతి పూటుగా మద్యం సేవించి కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. డ్రైవింగ్ సీటులో యువతి ఇరుక్కుపోయి ఉండటంతో కారు అద్దాలు పగులగొట్టి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆమెకు పెనుప్రమాదం తప్పింది. ప్రమాదంతో షాక్ కు గురైన ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 
 


More Telugu News