అమెరికాలో బాత్రూంలు కడిగినోళ్లకు ఏం తెలుసు?: కేటీఆర్‌పై నవీన్ యాదవ్ తండ్రి ఘాటు వ్యాఖ్యలు

  • కేటీఆర్‌పై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి ఫైర్
  • హైదరాబాద్ రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెలియదంటూ ఎద్దేవా
  • 48 ఏళ్లుగా తాము ప్రజల్లోనే ఉన్నామన్న శ్రీశైలం యాదవ్
  • నియోజకవర్గ అభివృద్ధే త‌న కుమారుడి లక్ష్యమని వెల్లడి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తన కుమారుడు నవీన్ యాదవ్ గెలుపొందిన అనంతరం ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చిన వారికి హైదరాబాద్‌లోని రౌడీలకు, పహిల్వాన్లకు మధ్య తేడా తెలియదు" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్ తనపైనా, తన కుమారుడిపైనా చేసిన ఆరోపణలపై ఆయన మీడియాతో మాట్లాడారు. తాము గత 48 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉన్నామని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై తమకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

భవిష్యత్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన కుమారుడి లక్ష్యమని చిన్న శ్రీశైలం యాదవ్ తెలిపారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల తమ పోరాటానికి లభించిన ఫలితమే ఈ విజయమని చెబుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.


More Telugu News