జూబ్లీహిల్స్‌లో ఓటమి.. మాగంటి సునీత కొడుకుతో దిగిన ఫొటో షేర్ చేస్తూ హిమాన్షు ఆసక్తికర ట్వీట్
- అన్నగా ఎల్లప్పుడూ తోడుగా ఉంటానన్న హిమాన్షు
- మాగంటి కుమారుడు వాత్సల్యనాథ్‌తో 13 ఏళ్ల స్నేహబంధం ఉందన్న హిమాన్షు
- ప్రచారంలో వాత్సల్య కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉందని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు ఫేస్‌బుక్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. మాగంటి గోపీనాథ్ కుమారుడు వాత్సల్యనాథ్‌తో ఇదివరకు దిగిన ఫొటోలను పంచుకుంటూ, ఒక అన్నగా ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటానని పేర్కొన్నాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత పరాజయం పాలైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వాత్సల్యనాథ్‌తో దిగిన ఫొటోలను హిమాన్షు పంచుకున్నాడు. వాత్సల్యతో తనకు 13 ఏళ్ల స్నేహబంధం ఉందని తెలిపాడు. మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత తల్లి సునీత ఎన్నికల ప్రచారంలో వాత్సల్య కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉందని హిమాన్షు అన్నారు.