రాహుల్ గాంధీకి 95వ ఓటమి.. అవార్డులు ఉంటే అన్నీ ఆయనకే దక్కేవి!: బీజేపీ నేత ఎద్దేవా
- రాహుల్ గాంధీ కీలక స్థానాన్ని చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ 95 సార్లు ఓడిందన్న మాలవీయ
- 2004 నుంచి 2025 వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అనేకసార్లు విఫలమైందన్న మాలవీయ
- ఇందుకు సంబంధించిన మ్యాప్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మాలవీయ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. దేశవ్యాప్తంగా జరిగిన పలు ఉప ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అయితే, తెలంగాణలోని జూబ్లీహిల్స్, రాజస్థాన్‌లోని అంటా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్ ఓటమి పాలుకావడమే కాకుండా, కాంగ్రెస్ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. గత రెండు దశాబ్దాలలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ 95 సార్లు ఓడిపోయారని బీజేపీ నేత అమిత్ మాలవీయ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కీలక స్థానాన్ని చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలలో ఆ పార్టీ 95 సార్లు ఓడిపోయినట్లు చూపే మ్యాప్‌ను మాలవీయ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.
2004 నుంచి 2025 వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అనేకమార్లు విఫలమైందని, ఇది రాహుల్ గాంధీకి మరో ఎన్నిక, మరో ఓటమి అని మాలవీయ వ్యాఖ్యానించారు. బీహార్‌లో తాజాగా ఎదురైన ఓటమితో రాహుల్ 95 సార్లు ఓడిన రికార్డును సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ఓటముల్లో అవార్డులు ఉంటే అవన్నీ ఆయనకే దక్కేవని, రాహుల్ గాంధీ వరుస పరాజయాలను చూసి ఓటమి కూడా ఆశ్చర్యపోక తప్పదని ఎద్దేవా చేశారు.