దేశంలోని ఉప ఎన్నికల ఫలితాలు ఇవే.. తెలంగాణ, రాజస్థాన్‌లలో కాంగ్రెస్... ఒడిశా, జమ్ములో బీజేపీ

  • జమ్ముకశ్మీర్‌లో ఒకచోట బీజేపీ, మరోచోట పీడీపీ విజయం
  • ఝార్ఖండ్‌లో ముక్తి మోర్చా అభ్యర్థి గెలుపు
  • పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలుపు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు విజయాలు సాధించాయి.

తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జమ్ముకశ్మీర్‌లో రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా, ఒకచోట బీజేపీ, మరోచోట పీడీపీ గెలుపొందాయి.

రాజస్థాన్‌లోని అంటా నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. జమ్ము కశ్మీర్‌లోని బడ్గామ్ నియోజకవర్గంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతజీర్ మెహ్దీ, నగ్రోటా నుంచి బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా గెలుపొందారు.

ఝార్ఖండ్‌లోని ఘట్సిల నియోజకవర్గంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి సోమేశ్ చంద్రసోరెన్, మిజోరాంలోని డంషా నుంచి మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ లల్తాంగ్లియానా, ఒడిశాలోని నౌపడ నుంచి బీజేపీ అభ్యర్థి జై దొలాకియా, పంజాబ్‌లోని తర్ణ్ తారన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సందు గెలుపొందారు.


More Telugu News