'సంతాన ప్రాప్తిరస్తు' ఇంటి భోజనం లాంటి సినిమా: తరుణ్ భాస్కర్
- విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా 'సంతాన ప్రాప్తిరస్తు'
- నవంబర్ 14న థియేటర్లలోకి రానున్న చిత్రం
- సినిమా ప్రివ్యూ చూసి ప్రశంసించిన దర్శకుడు తరుణ్ భాస్కర్
- ఇంట్లో భోజనం చేసినంత తృప్తినిచ్చిందన్న తరుణ్ భాస్కర్
- సున్నితమైన అంశాన్ని ఫన్, ఎమోషన్‌తో చక్కగా చూపించారు
- ఈ చిత్రంలో జాక్ రెడ్డి అనే కీలక పాత్రలో తరుణ్ భాస్కర్
విక్రాంత్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు (నవంబర్ 14న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జాక్ రెడ్డి అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్న ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, ఇటీవల సినిమా ప్రివ్యూ చూసి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమా చూశాక మంచి తెలుగు భోజనం చేసినంత తృప్తి కలిగిందని ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు కొన్ని సందేహాలు ఉండేవి. కానీ, సినిమా చూశాక అవన్నీ తొలగిపోయాయి. ఇది ఒక డీసెంట్ సినిమా. చూస్తున్నంత సేపు చాలా సరదాగా సాగిపోయింది. ఇంట్లో చేసిన మంచి భోజనం తిన్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో, ఈ సినిమా చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగింది. ఎక్కడా కథనం బరువుగా అనిపించలేదు, ఓవర్ డ్రామా లేదు’’ అని అన్నారు.
సమాజంలో సున్నితమైన అంశమైన సంతానలేమి (ఇన్ ఫెర్టిలిటీ) గురించి వినోదం, భావోద్వేగాలను జోడించి సినిమా తీయడం కష్టమని, కానీ దర్శకుడు సంజీవ్ రెడ్డి ఆ విషయంలో విజయం సాధించారని తరుణ్ భాస్కర్ కొనియాడారు. ‘‘దర్శకుడు సంజీవ్ రెడ్డికి పూర్తి స్పష్టత ఉంది. చైతన్య పాత్రలో విక్రాంత్ చక్కగా సరిపోయాడు. చిత్ర బృందం నిజాయతీగా చేసిన కృషి తెరపై కనిపిస్తోంది. ఈ నెల 14న థియేటర్లకు వస్తున్న ఈ సినిమాను తప్పకుండా చూడండి’’ అని ఆయన ప్రేక్షకులను కోరారు.
మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలతో ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.