జనసేన ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేశ్
- అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల కుమార్తె వివాహం
- భోగాపురంలో జరిగిన వేడుకకు హాజరైన మంత్రి లోకేశ్
- నూతన దంపతులు లక్ష్మీ రమ్య, అనంత్ బాబులకు శుభాకాంక్షలు
- కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నేతలు
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగిన ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వివాహ బంధంతో ఒక్కటైన లక్ష్మీ రమ్య, అనంత్ బాబు దంపతులకు మంత్రి లోకేశ్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు టీడీపీ నాయకులు కూడా పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
ప్రస్తుతం నారా లోకేశ్ సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం విశాఖలో ఉన్నారు. సీఐఐ సదస్సు నవంబరు 14, 15 తేదీల్లో జరగనుంది.