ఈ నెల 17న షేక్ హసీనాపై నమోదైన కేసులపై తీర్పు.. బంగ్లాదేశ్‌లో మరోసారి హింస

  • నేరాలకు పాల్పడినందుకు గాను హసీనాపై కేసులు నమోదు
  • నవంబర్ 17న తీర్పు వెలువరించనున్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్
  • సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన అధికారులు
మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసు అంశంలో త్వరలో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. దీంతో రాజధాని నగరం ఢాకాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలతో షేక్ హసీనాపై కేసులు నమోదవడం తెలిసిందే. ఈ కేసుల విషయంలో నవంబర్ 17న తీర్పు వెలువడనుంది. ఈ తీర్పు రానున్న నేపథ్యంలో, పలుచోట్ల దాడులు జరుగుతున్నాయి.

గతంలోని అనుభవాల దృష్ట్యా ఢాకాలో భద్రతను పెంచారు. ముఖ్యంగా తీర్పును వెలువరించే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చుట్టూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. తీర్పు నేపథ్యంలో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఢాకాలో లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. దీంతో నగరం సరిహద్దుల్లో భారీస్థాయిలో పోలీసులను మోహరించారు. రాజధాని నగరంలోకి ప్రవేశించే మార్గాల వద్ద పలు చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి, ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.


More Telugu News