Kuldeep Sengar: ఉన్నావ్ అత్యాచారం ఘటన.. కుల్దీప్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

Kuldeep Sengar gets setback in Delhi High Court in Unnao rape case
  • 10 సంవత్సరాల జైలు శిక్షను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టుకు సెంగర్
  • సెంగర్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
  • శిక్ష విషయంలో ఉపశమనం కల్పించేందుకు కారణాలు లేవన్న న్యాయమూర్తి
ఉన్నావ్ అత్యాచారం ఘటనలో బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో తనకు విధించిన 10 సంవత్సరాల జైలు శిక్షను నిలిపివేయాలని కోరుతూ కుల్దీప్ సింగ్ సెంగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. శిక్ష విషయంలో ఉపశమనం కల్పించేందుకు సరైన కారణాలు లేవని జస్టిస్ రవీందర్ పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు.

కాగా, ఉన్నావ్ అత్యాచారం కేసులో కుల్దీప్ సెంగర్ దోషిగా తేలడంతో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఈ శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. షరతులపై బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ తీర్పుపై సీబీఐ అధికారులు, బాధితురాలి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్ష నిలిపివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కస్టడీ నుంచి విడుదల చేయవద్దని పోలీసు శాఖను ఆదేశించింది.
Kuldeep Sengar
Unnao rape case
Delhi High Court
custodial death
victim's father
jail sentence

More Telugu News