ఢిల్లీలో కారు బాంబు పేలుడు.. హైదరాబాద్‌లో కొనసాగుతున్న తనిఖీలు

  • మూడు కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న హైఅలర్ట్
  • డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు
  • ఎక్కడ ఉగ్రకుట్రలు భగ్నమైనా హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న మూలాలు
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో రెండు రోజుల క్రితం కారు బాంబు పేలుడు సంభవించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో హైఅలర్ట్ కొనసాగుతోంది. నగరంలోని మూడు కమిషనరేట్ల (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) పరిధిలో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

దేశంలో ఎక్కడ దాడులు జరిగినా, ఏ రాష్ట్రంలో ఉగ్రకుట్రలు భగ్నమైనా వాటి మూలాలు హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్నాయి. రాజధానిలో విధ్వంస చర్యలు తగ్గినప్పటికీ, ఎన్ఐఏ, ఇతర రాష్ట్రాల పోలీసుల సోదాల్లో నగరానికి చెందిన వ్యక్తులు పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్ కూడా ఉన్నాడు.


More Telugu News