దువ్వాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు ఈ నెల 20న రద్దు
- ట్రాక్ మరమ్మతుల కోసం రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- నాలుగు ఎక్స్ ప్రెస్ రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు వివరణ
- ప్రయాణికులు గమనించాలని ప్రకటన జారీ
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ– దువ్వాడ సెక్షన్ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 20న నాలుగు ఎక్స్ ప్రెస్ రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. విజయవాడ - దువ్వాడ సెక్షన్‌లో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్నాయని వివరించింది. ఈ మార్గంలోని తుని, హంసవరం, అన్నవరం, రావికంపాడు స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ సెక్షన్ ప్రారంభం కోసం నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో కాకినాడ పోర్టు - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17267), రాజమండ్రి - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (67285), విశాఖపట్నం - కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ (17268), విశాఖపట్నం- రాజమండ్రి ఎక్స్‌ప్రెస్ (67286) రైళ్లను ఈ నెల 20 వ తేదీన రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు.