Vijay Deverakonda: బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం.. సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Attends SIT Inquiry on Betting App Promotion
  • నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో నోటీసులు
  • పారితోషికం, కమీషన్లపై సిట్ అధికారుల ఆరా
  • విజయ్‌తో పాటు ప్రకాశ్ రాజ్‌కు నోటీసులు
ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో సిట్ అధికారులు విజయ్‌ను ప్రశ్నిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ దేవరకొండతో సహా పలువురు ప్రముఖులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఇదివరకే పలువురిని విచారించిన సిట్ అధికారులు, నేడు విజయ్‌ను ప్రశ్నిస్తున్నారు.

బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విచారణకు హాజరు కావాలని విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాశ్ రాజ్‌కు కూడా సీఐడీ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.
Vijay Deverakonda
Betting Apps
CID SIT Investigation
Prakash Raj
Tollywood

More Telugu News