ఓటీటీకి 100 కోట్ల సినిమా .. 'డ్యూడ్'
- ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'డ్యూడ్'
- 100 కోట్లు రాబట్టిన సినిమా
- ఈ నెల 14 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో
- ఐదు భాషల్లో అందుబాటులోకి
ప్రేమకథలకు యూత్ ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ప్రేమకథలో ఫీల్ ఉండాలే గానీ, వాళ్లు ఆ కంటెంట్ కి కటౌట్ పెట్టేస్తారు. వందల కోట్ల వసూళ్లను ముట్టజెప్పేస్తారు. అలాంటి సినిమాల జాబితాలోనే 'డ్యూడ్' కూడా చేరిపోయింది. ప్రదీప్ రంగనాథన్ .. మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమా, అక్టోబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. 35 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, చాలా తేలికగా 100 కోట్లను వసూలు చేసి పెట్టింది.
కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, కొత్త కోణంలో ఆవిష్కరించారు. కథలోని కొత్త పాయింట్ యూత్ కి ఎక్కేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్'వారు దక్కించుకున్నారు. ఈ సినిమాను ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ పోస్టర్ ను కూడా వదిలారు.
హీరో తన మేనమామ కూతురును ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆమె మనసులో మరొకరు ఉన్నారని తెలుసుకుంటాడు. వేరే కులానికి చెందిన వ్యక్తితో పెళ్లికి తన మేనమామ ఒప్పుకోడనే విషయం అతనికి తెలుసు. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఫలితంగా ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి? అనేది కథ. ఐదు భాషల్లో ఓటీటీకి వస్తున్న ఈ సినిమాకి, ఈ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.