ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు ఘ‌ట‌న‌.. పరిస్థితిని గమనిస్తున్నామన్న అమెరికా

  • ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు.. స్పందించిన అమెరికా
  • పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న అమెరికా విదేశాంగ శాఖ
  • నగరంలోని తమ దేశ పౌరులకు కాన్సులర్ సహాయం అందిస్తామని ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన వాహనాల్లో సంభవించిన భారీ పేలుడులో కనీసం 9 మంది మృతి చెందగా, మరో డజను మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఢిల్లీ పర్యటనలో వున్న తమ దేశ పౌరులకు అవసరమైన కాన్సులర్ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

ఢిల్లీ పేలుడు ఘటన తమ దృష్టికి వచ్చిందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో స్పందిస్తూ, "న్యూఢిల్లీలో జరిగిన భయంకరమైన పేలుడు బాధితులకు మా ప్రగాఢ సానుభూతి. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం" అని పేర్కొంది.

ఇక‌, ఈ పేలుడు నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి, గస్తీని ముమ్మరం చేశారు. 


More Telugu News