నిశ్చితార్థంలో నెక్లెస్ ధరించిన అల్లు శిరీష్ పై ట్రోల్స్... స్పందించిన శిరీష్

  • నయనిక అనే అమ్మాయితో అల్లు శిరీష్ నిశ్చితార్థం
  • వేడుకలో మెడలో నెక్లెస్ ధరించిన శిరీష్
  • సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్
  • రాజులు కూడా చోకర్లు ధరించేవారంటూ ఫోటోలతో సమాధానం
టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ ఇటీవల తన నిశ్చితార్థంలో ధరించిన నెక్లెస్‌పై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ట్రోల్స్‌కు గట్టిగా బదులిచ్చారు. చారిత్రక ఆధారాలను చూపిస్తూ, తనదైన శైలిలో విమర్శకులకు సమాధానమిచ్చారు.

నయనిక అనే అమ్మాయితో ఇటీవల అల్లు శిరీష్ కి నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం అనంతరం అల్లు శిరీష్ పంచుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలలో శిరీశ్ మెడలో నెక్లెస్ (చోకర్) ధరించి కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మగవాళ్లు నెక్లెస్ ధరించడం ఏంటని కొందరు విమర్శించగా, మరికొందరు మీమ్స్, ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు. ఈ నెక్లెస్ ధర సుమారు 10 వేల డాలర్లు ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది.

తనపై వస్తున్న విమర్శలు, మీమ్స్‌పై అల్లు శిరీష్ ఎక్స్ వేదికగా స్పందించారు. "మన తెలుగు మీమ్స్ చాలా సరదాగా ఉన్నాయి. చోకర్లను మన భారతీయ మహారాజులు, మొఘలులు కూడా ధరించారు. పూర్వకాలంలో రాజులందరూ చోకర్లు పెట్టుకునేవారు" అని పేర్కొన్నారు. తన వాదనకు బలంగా, చోకర్లు ధరించిన మహారాజుల ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. అంతటితో ఆగకుండా... "నెక్లెస్‌కే ఇలా అయిపోతే.. పెళ్లికి వడ్డాణం పెట్టుకుంటే ఏమైపోతారో" అంటూ ఓ సరదా మీమ్‌ను కూడా పంచుకున్నారు.


More Telugu News