Tipper truck accident: రాజేంద్ర నగర్ లో విషాదం.. టిప్పర్ కిందపడి బాలుడి మృతి.. వీడియో ఇదిగో!

Tragedy in Rajendra Nagar Boy Dies in Tipper Truck Accident
––
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలుడిని టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ దారుణం అక్కడికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సీసీటీవీ ఫుటేజీలో బాలుడు, మరికొంతమంది నడుచుకుంటూ వెళుతుండగా వెనక నుంచి ఓ టిప్పర్ వస్తోంది. బాలుడి ముందు నుంచి టిప్పర్ ఎడమ వైపు వీధిలోకి తిరిగింది. అయితే, టిప్పర్ ను గమనించని బాలుడు పక్కనున్న వారితో మాట్లాడుతూ నడుస్తున్నాడు. మలుపు తిరిగే క్రమంలో టిప్పర్ వెనక భాగం బాలుడిని ఢీ కొట్టింది. దీంతో బాలుడు టిప్పర్ వెనక టైరు కిందపడ్డాడు.

డ్రైవర్ వెంటనే టిప్పర్ ను ఆపేసినా అప్పటికే టైరు పైకెక్కడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. రాజేంద్రనగర్ మైలార్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. మరణించిన బాలుడిని రియాన్ ఉద్దీన్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, డ్రైవర్ పై కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు.
Tipper truck accident
Mylardevpally
Riyan Uddin
Rajendra Nagar
Hyderabad accident
Road accident
CCTV footage
Boy killed
Negligence
Telangana news

More Telugu News