Shambhavi Choudhary: బీహార్ ఎంపీ రెండు వేళ్లకూ సిరా గుర్తులు.. వివాదం కావడంతో జిల్లా యంత్రాంగం వివరణ

Shambhavi Choudhary Two Ink Marks Cause Controversy in Bihar Elections
  • తొలి దశ పోలింగ్ సమయంలో ఓటు వేసిన ఎంపీ శాంభవి
  • మీడియా ముందుకు వచ్చి రెండు వేళ్లకూ సిరా గుర్తు చూపిన ఎంపీ
  • ఇది మానవ తప్పిదమని ఎంపీ, జిల్లా యంత్రాంగం వివరణ
లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్)కి చెందిన ఎంపీ శాంభవి చౌదరి రెండు వేళ్లకూ సిరా గుర్తు ఉండటం వివాదానికి దారితీసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలిదశ పోలింగ్ 6న ముగిసింది. తొలి దశ పోలింగ్ సమయంలో ఎంపీ శాంభవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత తన కుటుంబంతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు కుడి చేతికి ఉన్న సిరా గుర్తును చూపించారు.

అనంతరం తండ్రి సంజ్ఞ చేయడంతో ఆమె ఎడమ చేతికి ఉన్న సిరా గుర్తును చూపించారు. రెండు వేళ్లకూ సిరా గుర్తు ఉండటం వివాదానికి దారి తీసింది. ఆమె రెండుసార్లు ఓటు వేశారనే విమర్శలు వచ్చాయి.

ఇది వేరే స్థాయి మోసమని, ఇలా ఎందుకు జరుగుతుందని ఆర్జేడీ ప్రశ్నించింది. దీనిపై ఎవరు దర్యాప్తు జరుపుతారని నిలదీసింది. అయితే, ఇది మానవ తప్పిదం మాత్రమేనని, దీనిని వివాదం చేయవద్దని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో పాట్నా జిల్లా అధికారులు స్పందించారు. ఇది పోలింగ్ సిబ్బంది కారణంగా జరిగిన తప్పిదమని, సిబ్బందిలో ఒకరు కుడిచేతి వేలికి ఇంక్ వేసినట్లు విచారణలే తేలిందని పేర్కొన్నారు. తర్వాత ప్రిసైడింగ్ అధికారి జోక్యంతో ఎడమ చేతి వేలికి కూడా సిరా గుర్తు వేశారని స్పష్టం చేశారు. ఆమె ఓటు వేసిన కేంద్రం, ఆమె సీరియల్ నెంబర్ వివరాలను కూడా వెల్లడించారు.
Shambhavi Choudhary
Bihar elections
Lok Janashakti Party
Patna
Election Commission

More Telugu News