ఒకే ఓవర్లో 6 సిక్సర్లు.. పాక్ బ్యాటర్ విధ్వంసం!
- హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీలో పాక్ బ్యాటర్ విధ్వంసం
- ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన అబ్బాస్ అఫ్రిది
- యాసిన్ పటేల్ బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం
- 12 బంతుల్లోనే 55 పరుగులు చేసి జట్టును గెలిపించిన అబ్బాస్
- కువైట్‌పై పాకిస్థాన్‌కు చివరి బంతికి ఉత్కంఠ విజయం
పాకిస్థాన్ క్రికెటర్ అబ్బాస్ అఫ్రిది బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. హాంగ్‌కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భాగంగా ఒకే ఓవర్లో ఏకంగా ఆరు సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా కువైట్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ జట్టు చివరి బంతికి విజయం సాధించింది.
మాంగ్‌కాక్ మిషన్ రోడ్డు గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కువైట్ నిర్ణీత 6 ఓవర్లలో 123 పరుగులు చేసింది. అనంతరం 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు అబ్బాస్ అఫ్రిది అద్భుతమైన విజయాన్ని అందించాడు. బౌలర్ యాసిన్ పటేల్ వేసిన ఓవర్లో అబ్బాస్ వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మొత్తంగా కేవలం 12 బంతుల్లోనే 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆరు ఓవర్ల చొప్పున జరిగే ఈ హాంగ్‌కాంగ్ సిక్సెస్ టోర్నీలో అబ్బాస్ ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. కాగా, అబ్బాస్ అఫ్రిది గతంలో పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2024 జులైలో బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసి, న్యూజిలాండ్‌తోనూ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.
అయితే, జాతీయ జట్టు తరఫున ఆడిన 24 టీ20 మ్యాచ్‌ల్లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 12.18 సగటుతో 134 పరుగులు మాత్రమే చేయడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇప్పుడు ఈ టోర్నీలో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మరోసారి వెలుగులోకి వచ్చాడు.