అసభ్యంగా ప్రవర్తించాడు.. పీరియడ్స్ గురించి అడిగాడు: సెలక్టర్‌పై బంగ్లా మహిళా క్రికెటర్ ఆరోపణలు
- మాజీ సెలక్టర్ మంజూరుల్ ఇస్లాంపై మహిళా పేసర్ జహనారా ఆలం ఆరోపణలు
- 2022 ప్రపంచ కప్ సమయంలో అసభ్యకరమైన ప్రతిపాదనలు చేశారని వెల్లడి
- బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన
- శరీరానికి దగ్గరగా వచ్చి పీరియడ్స్ గురించి అసభ్యంగా అడిగాడని ఆరోపణ
- ఆరోపణలను ఖండించిన మాజీ సెలక్టర్ మంజూరుల్
- విషయంపై దర్యాప్తు చేస్తామన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్‌లో తీవ్ర కలకలం రేగింది. జాతీయ జట్టు మాజీ సెలక్టర్ మంజూరుల్ ఇస్లాం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అసభ్యకరమైన ప్రతిపాదనలు చేశాడని ఆ దేశ మహిళా ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. మానసిక ఆరోగ్య కారణాలతో ప్రస్తుతం ఆటకు దూరంగా ఉంటున్న ఆమె, ఇన్నాళ్లుగా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
2022 మహిళల వన్డే ప్రపంచ కప్ సమయంలో జట్టు యాజమాన్యం నుంచి తనకు అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదురయ్యాయని జహనారా వివరించారు. మాజీ సెలక్టర్ మంజూరుల్ ఇస్లాం ప్రతిపాదనలను తాను తిరస్కరించినందుకే తన కెరీర్‌కు అడ్డుపడ్డాడని ఆమె ఆరోపించారు. "నేను ఒకసారి కాదు, చాలాసార్లు ఇలాంటి ప్రతిపాదనలను ఎదుర్కొన్నాను. జట్టులో ఉన్నప్పుడు మా పొట్టకూటి కోసం ఎన్నో విషయాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు నిరసన తెలపాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి" అని జహనారా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)లోని పలువురు సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆమె తెలిపారు. మహిళా కమిటీ హెడ్, బీసీబీ సీఈవో సైతం తన ఫిర్యాదులను పట్టించుకోలేదని ఆరోపించారు.
ఆయన దగ్గరకు వస్తేనే భయపడేవాళ్లం
జట్టులో మంజూరుల్ ప్రవర్తన గురించి జహనారా వివరిస్తూ "అమ్మాయిల దగ్గరికి వచ్చి భుజంపై చేయి వేయడం, చాతీకి అదుముకుని, చెవి దగ్గర మాట్లాడటం ఆయనకు అలవాటు. అందుకే మేమంతా అతడిని దూరం పెట్టేవాళ్లం. మ్యాచ్‌ల తర్వాత షేక్‌హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా దూరం నుంచే చేతులు చాచేవాళ్లం. 'ఆయన వస్తున్నాడు, మళ్లీ హగ్ చేసుకుంటాడు' అని మేం భయంతో జోకులు వేసుకునేవాళ్లం" అని తెలిపారు.
ఒకానొక సందర్భంలో మంజూరుల్ తన దగ్గరకు వచ్చి చేతిని పట్టుకుని "నీ పీరియడ్ వచ్చి ఎన్ని రోజులయింది?" అని అసభ్యంగా అడిగాడని జహనారా గుర్తు చేసుకున్నారు. "ఐసీసీ నిబంధనల ప్రకారం ఫిజియోలు ఆటగాళ్ల ఆరోగ్యం కోసం ఈ వివరాలు తీసుకుంటారు. కానీ సెలక్టర్‌కు ఆ సమాచారం ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను 'క్షమించండి భయ్యా, నాకు అర్థం కాలేదు' అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను" అని ఆమె వివరించారు.
ఆరోపణలు నిరాధారం
జహనారా చేసిన ఆరోపణలపై మంజూరుల్ ఇస్లాం స్పందించారు. అవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశాడు. తన గురించి ఇతర క్రికెటర్లను అడిగితే తెలుస్తుందని అన్నాడు. మరోవైపు, ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించింది. జహనారా ఆరోపణలు చాలా తీవ్రమైనవని, దీనిపై త్వరలోనే సమావేశమై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని బోర్డు ఉపాధ్యక్షుడు షఖావత్ హొస్సేన్ తెలిపారు. అవసరమైతే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.