భారత్‌తో నాలుగో టీ20: టాస్ నెగ్గిన ఆసీస్.. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్

  • టాస్ గెలిచి మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్ కెప్టెన్‌
  • పిచ్‌ను అర్థం చేసుకునేందుకే ఈ నిర్ణయమన్న మిచెల్‌ మార్ష్
  • ఆస్ట్రేలియా జట్టులో నాలుగు కీలక మార్పులు
  • తాము బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామన్న సూర్యకుమార్ 
  • భారత జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సందర్భంగా మార్ష్ మాట్లాడుతూ.. తాము ఈ మైదానంలో ఎక్కువగా ఆడలేదని, అందుకే పిచ్‌ను అర్థం చేసుకునేందుకు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. జట్టులో నాలుగు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. జంపా, డార్షియస్, మ్యాక్స్‌వెల్, ఫిలిప్ తిరిగి జట్టులోకి వచ్చారని చెప్పాడు.

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే భావించామని అన్నాడు. "ఈ పిచ్ భారత ఉపఖండంలోని పరిస్థితులను పోలి ఉంది. అందుకే బోర్డుపై మంచి స్కోరు ఉంచాలనుకుంటున్నాం. నిన్న ప్రాక్టీస్ సెషన్‌లో బాగా సిద్ధమయ్యాం. గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం" అని వివరించాడు. భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశాడు.

తుది జట్లు:
ఆస్ట్రేలియా: మాట్ షార్ట్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జేవియర్ బార్ట్‌లెట్, బెన్ డార్షియస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్‌ శర్మ, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.


More Telugu News