తిరుమల ఘాట్ రోడ్డులో భారీ కొండ చిలువ
- భక్తుల కెమెరాకు చిక్కిన కొండచిలువ
- రాత్రి 9 గంటల సమయంలో కొండచిలువ సంచారం
- వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత ఘటన
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
తిరుమల కొండకు వెళ్లే భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండో ఘాట్ రోడ్డులో ఓ భారీ కొండచిలువ కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. మొన్న రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. మొన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో కొందరు భక్తులు కారులో తిరుమలకు వెళ్తున్నారు. రెండో ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత రోడ్డు పక్కన ఓ భారీ కొండచిలువ నెమ్మదిగా కదులుతూ కనిపించింది. దాన్ని చూసిన భక్తులు వెంటనే తమ వాహనాన్ని ఆపి, ఫోన్‌లో వీడియో తీశారు.
అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వేగంగా వైరల్ అయింది. రాత్రి వేళ ఘాట్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన గుర్తుచేస్తోంది. శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల సంచారం సాధారణమే అయినప్పటికీ, ఇంత పెద్ద కొండచిలువ రోడ్డుపై కనిపించడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.