ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు

  • జట్టు సభ్యులకు తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి
  • భారత జట్టు అద్భుతమైన పునరాగమనం చేసిందని ప్రశంస
  • 'నమో' అని సంతకం చేసిన జెర్సీ ప్రధానికి బహూకరణ
వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన జట్టు సభ్యులను అభినందించారు. వరుసగా మూడు ఓటముల తర్వాత భారత జట్టు అద్భుతమైన పునరాగమనం చేసిందని ఆయన కొనియాడారు.

మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు జట్టు సభ్యులు సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రపంచ కప్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ సందర్భంగా 'నమో' అని సంతకం చేసిన టీమిండియా జెర్సీని ప్రధానికి మహిళా జట్టు బహూకరించింది.

2017 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ చివరి వరకు పోరాడి ఓడింది. నాడు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అప్పుడు మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు ప్రధానిని కలిసింది. ఈ విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. అనంతరం మోదీకి ప్రపంచ కప్‌ను అందించారు.


More Telugu News