సినిమా ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌కు వచ్చిన కుంభమేళా 'మోనాలిసా'

  • కుంభమేళాలో పూసలు అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా
  • చరణ్ సాయి పక్కన లైఫ్ సినిమాలో నటిస్తున్న మోనాలిసా
  • చిత్ర ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్ వచ్చిన మోనాలిసా
2025 మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా గుుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు చిత్ర పరిశ్రమలో డిమాండ్ పెరుగుతోంది. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి తన కొత్త చిత్రం 'ది డైరీ ఆఫ్ మణిపూర్'లో అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా, ఆమె మలయాళంలో నాగమ్మ అనే సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అందాల భామ మోనాలిసా తెలుగు తెరపై కూడా కనిపించనున్నారు. క్రష్, ఇట్స్ ఒకే గురు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న చరణ్ సాయి హీరోగా, మోనాలిసా హీరోయిన్‌గా శ్రీను కోటపాటి దర్శకత్వంలో 'లైఫ్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవం కోసం మోనాలిసా హైదరాబాద్ వచ్చింది. శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్‌పై అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


More Telugu News