అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్‌లోనే కుప్పకూలిన ఫ్లైట్, ముగ్గురి మృతి

  • అమెరికాలోని లూయిస్‌విల్లేలో ఘటన
  • ఈ ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలు
  • గాల్లోకి ఎగరగానే విమానంలో చెలరేగిన మంటలు
  • హోనులులు వెళ్తుండగా జరిగిన ప్రమాదం
  • ఘటనను ధ్రువీకరించిన అమెరికా ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లూయిస్‌విల్లే నగరంలో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారికంగా ధ్రువీకరించింది.

వివరాల్లోకి వెళితే.. యూపీఎస్‌కు చెందిన ఫ్లైట్ నంబర్ 2976 కార్గో విమానం లూయిస్‌విల్లే నుంచి హోనులులుకు బయలుదేరింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటలకు టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లోకి ఎగురుతున్న సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అదుపుతప్పి కిందకు పడిపోయింది. మెక్‌డోనెల్ డగ్లస్ ఎండీ-11 రకానికి చెందిన ఈ విమానం పూర్తిగా దగ్ధమైంది.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానం గాల్లో ఉండగానే మంటల్లో చిక్కుకుని కూలిపోతున్న వీడియోలు పలువురిని కలచివేస్తున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 


More Telugu News