Lalan Singh: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి లలన్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్
- బీహార్ తొలిదశ పోలింగ్‌కు ముందు కేంద్ర మంత్రి లలన్ సింగ్‌పై కేసు
- పోలింగ్ రోజు కొందరు నేతలను బయటకు రానివ్వొద్దని వ్యాఖ్య
- ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
- మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఆర్జేడీ తీవ్ర ఆగ్రహం
- ఇది ఎలాంటి 'జంగిల్ రాజ్' అని ప్రధానిని ప్రశ్నించిన ఆర్జేడీ
బీహార్‌లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు కేంద్ర మంత్రి, జేడీయూ సీనియర్ నేత రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
మొకామా అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో లాలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. "పోలింగ్ రోజు కొందరు నాయకులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలి. ఒకవేళ వాళ్లు మరీ బతిమాలితే, మీతోపాటే తీసుకెళ్లి ఓటు వేయించి, తిరిగి ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టండి. వాళ్లను ఇంట్లోనే ప్యాక్ చేయాలి. సమయం లేదు, ఇప్పుడే బాధ్యతలు తీసుకోండి" అని ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఆయన వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తీవ్రంగా పరిగణించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. "లలన్ సింగ్ ఎన్నికల సంఘం చాతీపై బుల్డోజర్ నడుపుతున్నారు. నేతలను ఇంట్లో బంధించి, బ్రతిమాలితే ఓటుకు తీసుకెళ్లమని చెబుతున్నారు. ఈసీ ఎక్కడుంది?" అని ఆర్జేడీ తీవ్రంగా విమర్శించింది. ఆర్జేడీ ఫిర్యాదుతో స్పందించిన ఈసీ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో భారతీయ న్యాయ సంహిత, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
లలన్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకే మొకామా అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది. ఇక్కడి నుంచి జేడీయూ అభ్యర్థిగా బరిలో ఉన్న అనంత సింగ్‌పై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. వివాదాస్పద అభ్యర్థి కోసం ప్రచారం చేయడంపై ఎన్డీటీవీ నిన్న లలన్ సింగ్‌ను ప్రశ్నించగా "దోషి ఎవరో మీరెలా నిర్ణయిస్తారు? నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు. అంతమాత్రాన నేను నేరస్తుడిని అయిపోతానా? పోలీసులు విచారణ చేస్తారు. చాలా మంది తర్వాత నిర్దోషులుగా బయటపడతారు" అని ఆయన సమాధానమిచ్చారు.
లలన్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంపై జేడీయూ నేత నీరజ్ కుమార్ స్పందించారు. ప్రతిపక్షాలు కావాలనే నాటకీయత కోసం ఆయన మాటలను వక్రీకరించాయని ఆరోపించారు. మరోవైపు, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ "ఇది ఎలాంటి 'జంగిల్ రాజ్' అని ప్రధానిని అడగండి. మీ కేబినెట్ సహచరుడు ఇలా మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉంటారా?" అని ప్రశ్నించారు. ఆర్జేడీ పాలనను 'జంగిల్ రాజ్' అని ఎన్డీయే చేస్తున్న విమర్శలకు ఆయన ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.