డొనాల్డ్ ట్రంప్ అణుపరీక్షల వ్యాఖ్యలు.. స్పందించిన పాకిస్థాన్

  • మేం ఎప్పుడూ అణ్వాయుధాలను పునరుద్ధరించబోమన్న పాక్
  • అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం పాకిస్థాన్ కాదని వ్యాఖ్య
  • అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశంగా తాము ఉండబోమన్న పాక్
పాకిస్థాన్ అణ్వాయుధాలను పరీక్షిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం స్పందించింది. తామెప్పుడూ ఇతర దేశాల కంటే ముందు అణ్వాయుధాలను పునరుద్ధరించబోమని స్పష్టం చేసింది. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్ వంటి దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని ట్రంప్ ఇటీవల అన్నారు.

ఈ విషయమై పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ, అణు పరీక్షలు నిర్వహించిన మొదటి దేశం పాకిస్థాన్ కాదని, అదేవిధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశంగానూ తాము ఉండబోమని స్పష్టం చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ, బాధ్యతాయుతమైన అణ్వాయుధ దేశంగా చైనా ఎల్లప్పుడూ ఆత్మరక్షణ అణువ్యూహాన్ని సమర్థిస్తుందని అన్నారు. అణు పరీక్షలు నిలిపివేయాలనే విషయంలోనూ తాము అదే నిబద్ధతకు కట్టుబడి ఉంటామని తెలిపారు.


More Telugu News