నిర్మాతగా రీఎంట్రీ... ఇబ్బంది పెట్టవద్దంటూ బండ్ల గణేశ్ పోస్టు
- ప్రస్తుతం తాను ఏ సినిమానూ నిర్మించడం లేదన్న బండ్ల గణేశ్
- తనకు అందరి మద్దతు కావాలని ఆకాంక్ష
- చిరంజీవి సినిమా నిర్మించేందుకు బండ్ల గణేశ్ ఆసక్తిగా ఉన్నారంటూ ప్రచారం
ఇటీవల జరిగిన పలు సినిమా వేడుకలకు బండ్ల గణేశ్ హాజరుకావడంతో, ఆయన నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో, తన రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై బండ్ల గణేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు.