Rajiv Ranjan Singh: ఓటింగ్ రోజున వారు బయటకు రాకుండా ఇళ్లకు తాళాలు వేయండన్న కేంద్రమంత్రి.. కేసు నమోదు

Rajiv Ranjan Singh Case Filed Against Union Minister for Voting Remarks
  • మొకామా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో లలన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలు బయటకు రాకుండా అడ్డుకోవాలన్న కేంద్ర మంత్రి
  • ఈసీకి ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు
ఓటింగ్ రోజున పేద ప్రజలు బయటకు రాకుండా వారి ఇళ్లకు తాళాలు వేయాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) చేసిన వ్యాఖ్యలపై బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మొకామా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లలన్ సింగ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఓటింగ్ జరిగే రోజున పేద ప్రజలు బయటకు రాకుండా వారి ఇళ్లకు తాళాలు వేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఓటు వేయకుండా అడ్డుకోవాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ వీడియోను ఆర్జేడీ నాయకులు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా కేంద్ర మంత్రి ప్రవర్తించారని వారు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఓటర్లను బెదిరించేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. బెదిరింపుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసినందుకు కేంద్ర మంత్రిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని లలన్ సింగ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
Rajiv Ranjan Singh
Lalan Singh
Bihar elections
Lok Sabha elections 2024
Voting controversy

More Telugu News