Chhattisgarh train accident: ఛత్తీస్‌గఢ్‌లో గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు... ఆరుగురి మృతి!

Chhattisgarh Train Accident Passenger Train Collides With Goods Train 6 Dead
  • ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం
  • ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్ రైలు
  • గూడ్స్ రైలుపైకి ఎక్కిన ప్యాసింజర్ రైలు కోచ్
  • ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో నేడు ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కనీసం ఆరుగురు మరణించినట్లు భావిస్తున్నారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, కోర్బా ప్యాసింజర్ రైలు, ఆగి ఉన్న ఒక గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్యాసింజర్ రైలు మొదటి బోగీ.. గూడ్స్ రైలు పైకి ఎక్కింది. ప్రమాద స్థలం నుంచి వచ్చిన వీడియోలలో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నష్టం అంచనా వేయడంతో పాటు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Chhattisgarh train accident
Bilaspur train accident
Passenger train collision
Goods train accident
Indian Railways
Train accident India
Jairamnagar station
Korba passenger train
Train collision

More Telugu News