ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధుల భేటీ

  • తెలంగాణలో ఏడబ్ల్యూఎస్ సెంటర్లు, విస్తరణపై చర్చ
  • పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ
  • ముఖ్యమంత్రితో జర్మనీ కాన్సుల్ జనరల్ బృందం భేటీ
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. తెలంగాణలో ఏడబ్ల్యూఎస్ ఆన్ గోయింగ్ సెంటర్లు, వాటి విస్తరణపై చర్చించింది. ఈ సమావేశానికి ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్, ఇన్‌ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రితో జర్మనీ కాన్సుల్ జనరల్ బృందం భేటీ

జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ బృందం కూడా ముఖ్యమంత్రితో సమావేశమైంది. హైదరాబాద్‌లో జీసీసీని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపింది. డ్యూయిష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో జీసీసీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా రానున్న రెండేళ్లలో సుమారు వెయ్యి మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వెల్లడించింది.

పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడానికి జర్మనీ సహకారం అవసరమని అన్నారు. తెలంగాణ విద్యార్థులకు జర్మన్ భాష బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించాలని ముఖ్యమంత్రి కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ, జర్మనీ భాగస్వామ్యం మరింత బలపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్స్ రంగాల్లో జర్మనీ కంపెనీలను పెట్టుబడులు పెట్టమని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.


More Telugu News