ఎస్ఐఆర్... సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్

  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎస్ఐఆర్‌ను ప్రకటించిన ఎన్నికల కమిషన్
  • కోర్టులో డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి పిటిషన్
  • ఎస్ఐఆర్ నోటిఫికేషన్ కొట్టేయాలని విజ్ఞప్తి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమిళనాడు అధికార పక్షం డీఎంకే ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి తరఫున డీఎంకే ఎంపీ, సీనియర్ అడ్వొకేట్ ఎస్.ఆర్. ఇలాంగో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడులో ఎస్ఐఆర్ నిర్వహిస్తామంటూ అక్టోబర్ 27న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు.

తమిళనాడుతో పాటు పన్నెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ ప్రతిపాదిత ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి స్టాలిన్ ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.


More Telugu News