లండన్ లో 'ఆక్టోపస్ ఎనర్జీ' ప్రతినిధులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- లండన్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ
- ఆక్టోపస్ ఎనర్జీ సంస్థ ప్రతినిధులతో కీలక సమావేశం
- పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం
- 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ఏపీ లక్ష్యం
- అమరావతి, విశాఖలో స్మార్ట్ గ్రిడ్ అవకాశాలపై చర్చ
- రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన లండన్‌లోని అతిపెద్ద విద్యుత్ సరఫరా సంస్థ అయిన ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్ గెరాల్డ్ తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఈ సంస్థను సీఎం ఆహ్వానించారు. ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం వంటి నగరాల్లో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా, నియంత్రణ రంగంలో కలిసి పనిచేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు.
క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వారికి తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, లక్ష్యాలను ఆయన వారికి వివరించారు.
రాష్ట్రానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులను కోరారు.