జోగి రమేశ్ ను సస్పెండ్ చేయగలరా?: జగన్కు పట్టాభి సవాల్
- అన్ని ఆధారాలతోనే జోగి రమేశ్ ను అరెస్ట్ చేశారన్న పట్టాభి
- వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే జగన్ కొత్త నాటకాలు అని విమర్శ
- జగన్ కుటుంబానికే నకిలీ మద్యం కమీషన్లు అని ఆరోపణ
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించేందుకే జగన్ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. పక్కా ఆధారాలతోనే జోగి రమేశ్ ను అధికారులు అరెస్ట్ చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని తెలిపారు. ఈ కేసులో నిందితులైన అద్దేపల్లి సోదరులతో జోగి రమేశ్ జరిపిన ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాటింగ్లు వాస్తవం కాదా? అని పట్టాభి నిలదీశారు.
"నకిలీ మద్యం దందా ద్వారా వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు దండుకున్నది నిజం కాదా? విదేశాల్లో నడిపిన దందాను ఇక్కడ కూడా అమలు చేయడానికి శిక్షణ ఇచ్చి, నకిలీ మద్యం తయారు చేయించింది వాస్తవం కాదా?" అని పట్టాభి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మొత్తం వ్యవహారం జగన్ కుటుంబ సభ్యులకు కమీషన్లు ముట్టజెప్పడానికే సాగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నైతిక విలువలు ఉంటే తక్షణమే జోగి రమేశ్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.