పదో తరగతి, ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు

  • మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల భర్తీ
  • రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకం
  • ఈ నెల 21తో ముగియనున్న దరఖాస్తు గడువు
రక్షణ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(మెదక్) నియామక ప్రకటనను విడుదల చేసింది. సంస్థలోని జూనియర్ టెక్నీషియన్, డిప్లొమా టెక్నీషియన్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 1 నుంచే దరఖాస్తు గడువు ప్రారంభం కాగా.. 21వ తేదీతో గడువు ముగుస్తుందని ప్రకటించింది. కాంట్రాక్ట్ బేసిస్ పై మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ది డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ– 502205 చిరునామాకు పంపించాలని సూచించింది. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొంది. పూర్తి వివరాలను ddpdoo.gov.in వెబ్ సైట్ లో చూడాలని ప్రకటనలో తెలిపింది.

పోస్టులు: డిప్లొమా టెక్నీషియన్ (సీఎన్సీ ఆపరేటర్) 10, జూనియర్ టెక్నీషియన్ (మిల్వ్రైట్) 05, జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఎలక్ట్రిక్) 05, జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్) 03, జూనియర్ టెక్నీషియన్ (మిల్లర్) 01,  జూనియర్ టెక్నీషియన్ (ఎగ్జామినర్ ఇంజినీరింగ్) 09, జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్) 01.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో ఐటీఐ పాస్ అయి ఉండాలి. అభ్యర్థులకు పని అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాలు (రిజర్వేషన్ ప్రకారం సడలింపు ఉంటుంది).


More Telugu News