అంతపెద్ద తుపానులో ఎక్కువ ప్రాణనష్టం లేకుండా చూశాం... కానీ ఇవాళ భారీ ప్రాణ నష్టం జరిగింది: సీఎం చంద్రబాబు
- కాశీబుగ్గ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం
- ప్రైవేటు వ్యక్తుల బాధ్యతారాహిత్యం వల్లే ఈ ఘోరం జరిగిందని వ్యాఖ్య
- ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి ఉంటే ప్రాణనష్టం ఉండేది కాదన్న సీఎం
- సత్యసాయి జిల్లా సభలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటింపు
- పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ దుర్ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
శనివారం శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ కాశీబుగ్గ ఘటనను ప్రస్తావించారు.
అంత పెద్ద తుపానులో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని... తీరా చూస్తే ఈరోజు ప్రైవేటు వ్యక్తుల బాధ్యతా రాహిత్య చర్యలతో ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగిందని... ఇది అత్యంత బాధాకరమని అన్నారు.
కాగా, ప్రజావేదిక సభ వేదికగా కాశీబుగ్గ మృతులకు సంతాపంగా రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. ఆలయ నిర్వాహకులు ముందుగానే పోలీసులకు చెప్పి ఉంటే భక్తులను క్యూలైన్లలో నియంత్రించేందుకు అవకాశం ఉండేదని చంద్రబాబు అన్నారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.