జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సెలూన్‌లో హెయిర్ కట్ చేసిన ఎర్రబెల్లి
- ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న నాయకులు
- మధురానగర్‌లో సెలూన్ షాప్‌లోకి వెళ్లి ఓటు అభ్యర్థించిన ఎర్రబెల్లి
- మాగంటి సునీతను గెలిపించాలని విజ్ఞప్తి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తరఫున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌లో పర్యటించిన ఆయన ఒక సెలూన్‌లోకి వెళ్లి అక్కడ ఒక వ్యక్తికి హెయిర్ కట్ చేశారు. మాగంటి సునీతకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
అటు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నాయకురాలు, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా చెరకు జ్యూస్ పాయింట్ వద్ద జ్యూస్ తీసి అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం, ఆమె స్వయంగా జ్యూస్‌ను గ్లాసులలో పోసి అక్కడున్న వారికి అందించారు.