ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు, సిబ్బందిని అభినందించిన ఏపీ డీజీపీ
- కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో వేగంగా దర్యాప్తు
- కేవలం 13 గంటల్లోనే మృతుల డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి చేసిన ఫోరెన్సిక్ ల్యాబ్
- ఫోరెన్సిక్ డైరెక్టర్ పాలరాజు, బృందాలను అభినందించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- త్వరితగతిన పరీక్షలు పూర్తి చేయడంతో బాధితుల కుటుంబాలకు మృతదేహాల అప్పగింత
- సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించిన డీజీపీ
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ .. ఫోరెన్సిక్ నిపుణులు అత్యంత వేగంగా డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ పూర్తి చేయడం వల్లే మృతదేహాలను త్వరితగతిన గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం సాధ్యమైందని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు ఇది ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.
ప్రమాద స్థలంలో లభ్యమైన భౌతిక, రసాయన, జీవ సంబంధిత నమూనాలను విశ్లేషించడంలో, అలాగే 'సీన్ రీక్రియేషన్' చేయడంలో ఫోరెన్సిక్ బృందాలు కీలక పాత్ర పోషించాయని డీజీపీ వివరించారు. ఈ సంక్లిష్టమైన విశ్లేషణలో భాగస్వాములైన 16 బృందాలలోని సభ్యులను డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రాలు అందజేసి గౌరవించారు. వారి వృత్తి నైపుణ్యం, అంకితభావం ప్రశంసనీయమని ఆయన అన్నారు.